గవర్నర్ రాజకీయ నాయకురాలిగా మారారు!

by GSrikanth |
గవర్నర్ రాజకీయ నాయకురాలిగా మారారు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ రాజకీయ నాయకురాలిగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన రోజున గవర్నర్, గవర్నమెంట్ ఇద్దరు ఒక్కటి అవుతున్నారని ఆ తర్వాతి రోజుల్లో పొలిటికల్ డ్రామాకు తెరలేపి రక్తి కట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు వేరు కాదన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందంలో భాగంగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అధికారులు గవర్నర్ మాట వినకుంటే గవర్నర్ అధికారులందరినీ పిలిచి సమీక్ష నిర్వహించవచ్చు కదా అన్నారు. ఒకవేళ గవర్నర్ మాట అధికారులు వినకుంటే అలాంటి వారిపై డీవోపీటీకి రికమండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. అలా రికమండ్ చేస్తే సీఎస్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. పాదయాత్రలపై స్పందించిన రేవంత్ రెడ్డి పార్టీలో నేతలంతా పాదయాత్రలు చేయాల్సిందే అన్నారు. ఉత్తమ్ మహేశ్వర్ రెడ్డి ఎవరు చేసినా అవన్నీ హాథ్ సే హాథ్ జోడో యాత్రలే అన్నారు. పాదయాత్రలు చేయని నాయకులపై పార్టీ చర్యలు ఉంటాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed