సీఎంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-06 06:12:28.0  )
సీఎంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో చకచకా సాగుతున్నాయి. కాగా, రేవంత్ రెడ్డికి సీఎం పదవిపై మునుగోడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి హార్టియెస్ట్ కంగ్రాచ్యూలేషన్స్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నేరవేరడమే లక్ష్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story