Revanth Reddy : ప్రతి నియోజకవర్గంలో 12 వేల కాంగ్రెస్ ఓట్లను తొలగించారు

by Javid Pasha |   ( Updated:2023-07-06 16:39:22.0  )
Revanth Reddy : ప్రతి నియోజకవర్గంలో 12 వేల కాంగ్రెస్ ఓట్లను తొలగించారు
X

దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 వేల ఓట్లను తొలగించారని ఆరోపించారు. కుటుంబానికి 5 ఓట్లు ఉంటే 2 ఓట్లను తొలగించారని అన్నారు. ఎన్నికల సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు వింటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. ఎన్నికల చట్టాల్లోని లొసుగులును అడ్డంగా పెట్టుకొని ఈ రెండు పార్టీలు రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి కుట్రలను తిప్పి కొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ, జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఈ నెల 18న బోయిన్ పల్లిలోని రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని రేవంత్ తెలిపారు.

ఈ క్రమంలోనే ఈ నెల 15 లోగా మండల, పట్టణ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయన్న రేవంత్.. ప్రతి బూత్ కు బీఎల్ఏలను నియమించుకోవాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల అక్రమాలను అడ్డుకోవడానికి ఈ బూత్ లెవెల్ కార్యకర్తలు బాగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నికలకు ఇంకా 120 రోజుల గడువే ఉన్నందున ప్రతి కార్యకర్త ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పార్టీ కోసం పని చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed