విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ్ళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్

by Satheesh |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ్ళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలోనే దీనిపై లోతుగా సమీక్ష జరిగింది. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యా సంస్థలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురావడంపై ఆచరణాత్మక సమస్యలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు చర్చించారు. విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట వీటిని నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలపై రివ్యూ చేశారు. తరగతి గదులు, హాస్టళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్, కొద్దిమంది అధికారులకు (వార్డెన్) క్వార్టర్స్ తదితరాలన్నింటిపై చర్చించారు. భవనాలను కొత్తగా నిర్మించాల్సి ఉన్నందున ఒకే తరహా డిజైన్ ఉండేలా అధికారులకు సూచనలు చేశారు.

ఆ ప్రకారం కొన్ని డిజైన్లు రెడీ అయ్యాయి. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తదితరులు ఆదివారం సమీక్షించారు. ఈ కొత్త స్కీమ్‌కు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. తొలుత అక్కడ వీటిని నిర్మాణం చేసి ఆ తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్మించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఎకరాల చొప్పున స్థలాన్ని సేకరించింది. ఆర్కిటెక్టుల నుంచి వచ్చిన డిజైన్లలో ఉత్తమంగా ఉన్నవాటిని ఎంపిక చేసి ఈ రెండు నియోజకవర్గాల్లో నిర్మించి ఆచరణాత్మక సమస్యల స్టడీ తర్వాత మిగిలిన సెగ్మెంట్లలోనూ నిర్మించాలని భావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed