'ఈ రేవంతుడు…తెలంగాణ హనుమంతుడు' ..హనుమాన్ జయంతి సందర్భంగా సీఎం ఆసక్తికర ట్వీట్

by Prasad Jukanti |
ఈ రేవంతుడు…తెలంగాణ హనుమంతుడు ..హనుమాన్ జయంతి సందర్భంగా సీఎం  ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల ప్రచారం అంతా దేవుళ్లు, మతం చుట్టూ తిరుగుతున్నది. ఈ క్రమంలో మోడీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే మతచిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ధ్వజమెత్తుతుంటే మత రాజకీయం మాది కాదని దేశ సంపదంతా ముస్లింలకే దోచిపెట్టేందుకు కాగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇరు పార్టీల మధ్య రిలీజియన్ పాలిటిక్స్ రచ్చ రేపుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ లో ‘ఈ రేవంతుడు తెలంగాణ హనుమంతుడు’ అంటూ వ్యాఖ్యానించారు. 'రాముడి విధేయుడు… రాక్షస వధ వీరుడు… హనుమంతుడు… ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట…ఈ రేవంతుడు…తెలంగాణ హనుమంతుడు. ఇప్పటికీ ఎప్పటికి …ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.

ఇందులో ఈ రేవంతుడు తెలంగాణ హనుమంతుడు అంటూ సీఎం చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగాల్లో దేవుడి పేర్లను ప్రస్తావిస్తున్నారు. పంద్రాగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తానంటూ ఆయా దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటున్నారు. ఈ అంశాన్ని బీజేపీ కార్నర్ చేస్తోంది. మరో వైపు రామమందిర నిర్మాణాన్ని బీజేపీ తమ ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాను తెలంగాణ హనుమంతుడిని అని చెప్పుకోవడం చర్చనీయాశం అవుతున్నది. బీజేపీ హిందూ పోలరైజేషన్ కు హిందుత్వా ద్వారానే ఎటాక్ చేయడం ద్వారా ప్రయోజనం దక్కబోతున్నదనే సీఎం ఈ తరహా తన వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది.



Advertisement

Next Story