Retirement: హైదరాబాద్ షట్లర్ సంచలన నిర్ణయం.. షాక్‌లో బాడ్మింటన్ ఫాన్స్

by Shiva |   ( Updated:2024-03-04 17:17:03.0  )
Retirement: హైదరాబాద్ షట్లర్ సంచలన నిర్ణయం.. షాక్‌లో బాడ్మింటన్ ఫాన్స్
X

దిశ, వెడ్‌డెస్క్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు హైదరాబాద్ షట్లర్ అనూహ్యంగా వీడ్కోలు పలికాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత బి.సాయి ప్రణీత్ సోమవారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, సింగపూర్ ఓపెన్‌లో విజయం సాధించి, టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తరువాత అతడు తన కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎలాంటి మచ్చా లేకుండా ప్రణీత్ బ్యాడ్మింట్ అద్భుతాలు సృష్టించాడు. 2017 సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ కైవసం, స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో ర్యాంకింగ్ పరంగా చూస్తూ.. ప్రపంచంలోనే 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత ఏకంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి గ్రూప్ దశలోనే వైదొలిగాడు.




Advertisement

Next Story