Renu Desai: పవన్ కల్యాణ్ మాజీ భార్యకు మంత్రి కొండా సురేఖ అదిరిపోయే గిఫ్ట్

by Gantepaka Srikanth |
Renu Desai: పవన్ కల్యాణ్ మాజీ భార్యకు మంత్రి కొండా సురేఖ అదిరిపోయే గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి, నిర్మాత, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకు రేణు దేశాయ్ వివరించారు. ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ను మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. అంతేకాదు.. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.




Advertisement

Next Story

Most Viewed