Kims Hospital: శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల

by Gantepaka Srikanth |
Kims Hospital: శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌(Sandhya Theatre)కు వెళ్లి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్(Sri Tej) కిమ్స్ ఆస్పత్రి(Kims Hospital)లో చికిత్స పొందుతున్నాడు. సోమవారం బాలుడి హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. రెండ్రోజులుగా మినిమల్ వెంటిలేటర్‌తో శ్రీతేజ్‌కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. న్యూరోలాజికల్‌ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదని అన్నారు. పైప్‌ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గిందని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా, అదే తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతిచెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబానికి పుష్ప-2 చిత్రబృందం రెండు కోట్ల పరిహారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షల సాయం అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed