హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రవీందర్‌రెడ్డి ఎన్నిక

by GSrikanth |
TS High Court Asks Government to file Report on Right to Education
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఏ.రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా ఏ.దీప్తి, కార్యదర్శులుగా ఉప్పల శాంతిభూషణ్‌రావు, జిల్లెల్ల సంజీవ్, జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్ కుమార్, కోశాధికారిగా కట్ట శ్రావ్య తదితరులు ఎన్నికయ్యారు. ఏడాది కాలం పాటు వీరు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్‌కు గురువారం జరిగిన ఎన్నికల ఫలితాల సాయంత్రానికే వెల్లడయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు బార్ అసోసియేషన్‌ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్‌గా మహిళలు గెలుపొందలేదు. ఫస్ట్ టైమ్ దీప్తి వైస్ ప్రెసిడెంట్‌గా 805 ఓట్లు పొంది ఆ పోస్టుకు పోటీపడిన కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి కంటే 45 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

అసోసియేషన్ అధ్యక్ష పదవికి నలుగురు పోటీపడగా అందులో రవీందర్‌రెడ్డి అత్యధికంగా 968 ఓట్లు సాధించి గెలుపొందారు. రెండో స్థానంలో ఏ.జగన్ 935 ఓట్లు పొందారు. చిక్కుడు ప్రభాకర్ 528 ఓట్లతో నాల్గవ స్థానానికి పరిమితమయ్యారు. రెండు కార్యదర్శి పోస్టులకు ఐదుగురు పోటీపడగా అందులో 1280 ఓట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉప్పల శాంతిభూషణ్‌రావు, 1038 ఓట్లతో జిల్లెళ్ళ సంజీవ్ సెకండ్ ప్లేస్‌లో నిలవడంతో వీరిద్దరూ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు ఇద్దరు మహిళాలు సహా మొత్తం ఆరుగురు పోటీపడగా అందులో ఏ.దీప్తి అత్యధికంగా 805 ఓట్లు పొంది విజయం సాధించారు. ఒక జాయింట్ సెక్రటరీ పోస్టుకు సైతం ఆరుగురు పోటీపడగా అందులో వాసిరెడ్డి నవీన్ 902 ఓట్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి గెలుపొందారు.

కోశాధికారి (ట్రెజరర్)గా కట్టా శ్రావ్య అత్యధికంగా 1484 ఒట్లు పొంది విజేతగా నిలిచారు. రెండో స్థానంలో ఉన్న రాపోలు నవీన్ కుమార్ కేవలం775 ఓట్ల దగ్గరే ఆగిపోయారు. స్పోర్ట్స్-కల్చరల్ సెక్రటరీగా ఎస్.అభిలాష్ (940 ఓట్లు), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డీవీ శ్రీకాంత్ (1561), జీ.సుందరేశన్ (1345), కొల్లి గణపతి (1104), మహ్మద్ హబీబుద్దీన్ (1022) గెలుపొందారు.

Advertisement

Next Story

Most Viewed