- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సాయిచంద్కు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఇదే (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన సాయిచంద్ (39) ఈరోజు ఉదయం అకాల మరణం చెందారు. తెలంగాణ ఉద్యమ పాటలతో పాటు ఆయన ఎన్నో దళిత ఉద్యమ పాటలు పాడారు. అనంతరం 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాలను సాయిచంద్ తన పాటతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఆయనకు బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా’’ అనే పాట. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో సాయిచంద్ ఈ పాట పాడారు.
అమరుడు శ్రీకాంత్ చారిని గుర్తు చేసుకుంటూ సాయిచంద్ ఆలపించిన ఈ పాటకు ప్రతిఒక్కరూ కన్నీరుపెట్టారు. కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా సాయిచంద్ తన పాటతో కదిలించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ గాయకుడు సాయిచంద్ కు తగిన ప్రాధాన్యం ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.