- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడియం శ్రీహరి మాదిగ ద్రోహి.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తాం: రసమయి బాలకిషన్
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముసలి నక్కలు అన్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయని అన్నారు. మాదిగ జాతిని మొత్తాన్ని నిరీర్వం చేసిన ఘనత కడియం శ్రీహరిదేనని.. ఆయన వైఖరి వల్లనే తాడికొండ రాజయ్య, ఆరూరీ రమేష్ వెళ్ళిపోయారన్నారు. తెలంగాణ ద్రోహి టీడీపీ నుండీ పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర నీదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌లోకి వస్తా అంటే కేసీఆర్ రానిచ్చారన్నారు. కడియం శ్రీహరి మాదిగ ద్రోహి, మాదిగ జాతి అంటే కల్లమంట అని ధ్వజమెత్తారు.
వరంగల్‌లో కడియం శ్రీహరిపై చావు డప్పు కొడుతాం.. ఆయన మాదిగలకు ద్రోహం చేశాడు కాబట్టి కచ్చితంగా ఓడిస్తామన్నారు. ఓడగొట్టి పాతి పెట్టే వరకు రసమయి బాలకిషన్ కాలుకి గజ్జె కట్టి ఆడి, పాడుతాడని ప్రకటించారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టిలో సభ్యత్వం లేదు ఆమె కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అమరత్వంపై పాడిన పాటలను, తెలంగాణ సంస్కృతిని ఎంపీ కేకే అవమానించడం సరైంది కాదన్నారు. కేశవరావుకు మతి భ్రమించినట్లుందని ఫైర్ అయ్యారు. మిలియన్ మార్చ్‌లో కేశవరావును కొడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలన్నారు. కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే కేశవరావు ఇంటి ముందు దూందాం నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ మొదట్నుండి తెలంగాణ బ్రతుకుల మీద విషం చిమ్ముతున్నదని.. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహి పార్టీ అని చెప్పులతో కొట్టారని ధ్వజమెత్తారు. మనిషి చనిపోతే చావు డప్పు కొట్టే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వలేదని.. మాదిగలకు సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడుతామన్నారు. మాదిగ జాతి ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. వందకు వంద శాతం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ వెంటే మేము ఉంటామని స్పష్టం చేశారు. మా పార్టీ ఆదేశిస్తే నేను వరంగల్ నుండీ పోటీ చేస్తానని ప్రకటించారు.