- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
X
దిశ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ పార్థసారధి పదవీకాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేండ్ల పాటు ఆమె ఎస్ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1988 బ్యాచ్‌కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆమెని తిరిగి అదే హోదాలో కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్ఈసీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Next Story