- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలి: ఎమ్మెల్యే కాలే యాదయ్య
దిశ, చేవెళ్ల: క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య క్రీడాకారులకు సూచించారు. చేవెళ్ల మండల పరిధిలోని పామెన గ్రామ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న సీఎం కప్ 2023 క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామాల్లోని యువతలో దాగియున్న ప్రతిభను వెలికితీసేందుకే క్రీడా ప్రాంగణాలు నిర్మించేలా ముందస్తు ప్రణాళికలు రచించారని గుర్తు చేశారు. యువకులు, విద్యార్థులు క్రీడా ప్రాంగణాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.
క్రీడల్లో రాణించే యువతకు ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. వాలీబాల్ లో విజేతగా నిలిచిన దామరగిద్ద, కబడ్డీలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న పామెన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. వాలీబాల్, కబడ్డీలో రన్నరప్ లు గా నిలిచిన ఆలూరు గ్రామ జట్టు సభ్యులను ట్రోఫితో పాటుగా ధృవీకరణ పత్రాలు, మెడల్స్ అందజేశారు. అదేవిధంగా షార్ట్ ఫుట్, లాంగ్ జంప్, వంద మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబర్చిన యువకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ళ ప్రభాకర్, పామెన సర్పంచ్ అక్నాపురం మల్లారెడ్డి, దామరగిద్ద సర్పంచ్ మలిపెద్ది వెంకటేషం గుప్త, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ చారి, ఎంపీడీవో రాజ్ కుమార్, తహశీల్దార్ వై.ఎస్. శ్రీనివాస్, ఎంఈఓ సయ్యద్ అక్బర్, ఎంపీవో విఠలేశ్వర్ జీ, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాజేష్, పీఈటీలు కె. శ్రీనివాసరావు, సుధ, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు తోట చంద్రశేఖర్, ఏఎంసీ చేవెళ్ల డైరెక్టర్ మహ్మద్ ఫయాజుద్దీన్, విజయ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.