అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తయ్యేనా..?

by Aamani |
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తయ్యేనా..?
X

దిశ,యాచారం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే పాఠశాలలను ఎంపిక చేసి 60 శాతం వరకు మాత్రమే పనులను పూర్తి చేయగా కొన్ని పాఠశాలలలో నత్త నడక పనులు కొనసాగుతూ ఉండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా మొదటి విడతలో 15 పాఠశాలలో మంచి నీటి సరాఫరా, మరుగుదొడ్ల మరమ్మత్తు పనులు విద్యుత్‌ సదుపాయం, రంగులు వేయటం మైనర్‌ రిపేరు వంటి పనులన్ని పూర్తి చేయగా, అమ్మ ఆదర్శ, పాఠశాలల్లో ఎంపికైన 8 పాఠశాల పనులు పూర్తికాగా యాచారం లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, గాండ్లగూడ, గొల్లగూడ, కిషన్ పల్లి, మేడిపల్లి, మీసాల తండా, మొగుళ్ళ వంపు, నక్క గుట్ట తండా, నల్లవెల్లి తండా, గున్ గల్, చిన్నతుండ్ల, చింతపట్ల గ్రామాలలోని ఇంకా పనులు కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే పనులను పూర్తి చేయాలని పలువురు కోరుకున్నారు.

త్వరలోనే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తి : ఇంచార్జ్ ఎంఈఓ పాండురంగారెడ్డి

అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎంపికైన పాఠశాలలలో చివరి దశలో పనులు ఉన్నాయని చెప్పారు. బొల్లిగుట్ట తండా లో మాత్రం విద్యార్థులే లేని కారణంగా ఎంపిక చేయలేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed