- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కప్ టోర్నీకి స్థలమేది?
దిశ, తాండూరు రూరల్: గ్రామీణ యువత క్రీడల్లో రాణించేలా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. యువత క్రీడల్లో రాణిస్తే దేహదారుఢ్యంతోపాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రాంగణాల ఏర్పాటుపై దృష్టి సారించింది. క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ పలు చోట్ల ఇంకా పనులు ప్రారంభించలేదు. అనేక చోట్ల స్థలం వివాదంతో మొదటికే మోక్షం లేకుండా పోయింది. పనులు పూర్తయిన వాటిలో కూడా మొక్కుబడిగా మౌలిక వసతులను మరిచారు.
ఒక్కో క్రీడా ప్రాంగణానికి దాదాపు రూ.2.50 లక్షలు కేటాయించినప్పటికీ పలు చోట్ల మైదానం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఊరికి దూరంగా క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడంతో యువత ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ క్రీడా ప్రాంగణాలు మందుబాబులకు అడ్డాగా మారుతుంది. మరికొన్ని చోట్ల అదే స్థలాన్ని బహిర్భూమికి వాడుతున్నారు. క్రీడా ప్రాంగణాల్లో ఒక్క రోజు కూడా ఏ ఒక్క క్రీడా నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ సంకల్పం ఆచరణలో విఫలమవుతోందనడానికి గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
తాండూరు మండలం మిట్టబాష్ పల్లిలో తడిచెత్త, పొడిచెత్త కేంద్రంలో క్రీడా ప్రాంగణంలోనే నిర్మించారు. బషీరాబాద్ మండలం, మంతన్ గౌడ్ తండాలో క్రీడా ప్రాంగణంలో సరైన స్థలం లేక పొలాల మధ్య ఆటలాడుతున్నారు. క్రీడా ప్రాంగణాల పేరిట పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం తో అనువైన స్థలాలను ఎంపిక చేయకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి.
ఊరికి దూరంగా..
గ్రామాల్లో నివాస ప్రాంతాలకు సుదూరంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు ఉపయోగించేందుకు ఆసక్తి చూపడం లేదు. కొన్ని చోట్ల నివాస ప్రాంతాలకు 3, 4 కిలోమీటర్ల దూరాన నిర్మానుష్య ప్రాంతాల్లో అడవికి దగ్గరగా ఏర్పాటు చేయడంతో అటు వైపు వెళ్లేందుకు మహిళా క్రీడాకారులు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం నడిచేందుకు సాధారణ ప్రజలు కూడా దూరమవడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
మౌలిక వసతులు లేక..
క్రీడా ప్రాంగణాల చుట్టూ కనీసం ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయక పోవడం తో పశువులు యథేచ్ఛగా తిరగుతున్నాయి. నిబంధనల మేరకు వాలీబాల్, ఖోఖో కోర్టు, షాట్‌పుట్, లాంగ్‌జంప్ సాధన చేసే వారి కోసం గ్రావెల్ వేసి మైదానాన్ని క్రీడలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేవలం భూమిని చదును చేసి క్రీడా ప్రాంగణం పేరిట ఆర్చ్ ఏర్పాటు చేశారు. వాలీబాల్ కోర్ట్ పేరిట రెండు ఇనుపపోల్‌ను, మరో రెండు వ్యాయా మానికి ఉపయోగపడే ఇనుప పైపులతో కూడిన పోల్స్‌ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఒక్కో ప్రాంగణానికి దాదాపు రూ.2.50 లక్షలు వెచ్చించినప్పటికీ కనీస వసతులు ఏర్పాటు చేయకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా..
ఈ స్థలాలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా ఖాళీగా ఉన్నాయి. లక్ష్యం పూర్తి చేయడానికే ఇలా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని గుంటిపల్లిలో చెరువు శిఖం భూమి పక్కనే ఏర్పాటు చేయగా వర్షానికి నీళ్లు వచ్చాయి. అవుసులోనిపల్లికి కిలో మీటర్ దూరంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం గుంతలు తప్ప ఆటలు ఆడే పరిస్థితి లేదు. మండలంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఎలాంటి ముందు చూపు లేకుండా ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. కేవలం పనులు చేసి బిల్లులు పొందాలనే ఆలోచనతో ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి.
ఇదీ పరిస్థితి..
క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టి కొన్ని నెలలు అవుతున్నా చాలా చోట్ల అవి అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాలో 566 పంచాయతీలకు 711 చోట్ల క్రీడా ప్రాంగణాలు మంజూరు చేశారు. ఇందులో సుమారు 400కు పైగా పూర్తి చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. మిగతా క్రీడాప్రాంగణాల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక్కో క్రీడా ప్రాంగణాన్ని కనీసం ఎకరం స్థలంలో ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ పలు చోట్ల స్థలాభావంతో 10 నుంచి 20 గుంటల్లోనే ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాల చుట్టూ మొక్కలను పెంచాల్సి ఉండగా ఎక్కడా మొక్కలు నాటలేదు. మరికొన్ని చోట్ల నాటిన మొక్కలు ఎండిపోయి గుంతలే దర్శనమిస్తున్నాయి.
సీఎం టోర్నీకి స్థలమేది?
క్రీడాకారుల ప్రతిభ వెలికితీసేందుకు సర్కారు రాష్ట్రంలో తొలిసారిగా సీఎం కప్ పోటీలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తుంది. కానీ ఎక్కడా క్రీడా ప్రాంగణంలో సరిపడా స్థలం లేదు. సోమవారం నుంచి మండల స్థాయి గేమ్స్ జరుగనుండగా, క్రీడా కమిటీకి ఎంపీపీ చైర్మన్‌గా, ఎంపీడీవో కన్వీనర్‌గా జడ్పీటీసీ, తహశీల్దార్, ఎంఈవో, ఎస్‌ఐ, మున్సిపల్ కమిషనర్, పీడీ, పీఈటీలను సభ్యులుగా ఏర్పాటు చేశారు.