రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే - మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ,మహేశ్వరం: రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ హైట్రిక్ సీఎంగా అవుతారన్నారు.ఆదివారం మహేశ్వర మండలంలోని తుమ్మలూరు, గంగారం, రామచంద్రగూడ ,పెండ్యాల కల్వకోల్ ,దుబ్బచర్ల, దిల్వార్ గూడ, కోళ్ల పడకల్, పోరండ్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో 16 కోట్ల 36 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...60 సంవత్సరాలుగా సాధించలేని అభివృద్ధి 9 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సాధించిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు.సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఇంఛార్జీ ఎంపీపీ సునీత అంధ్య నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి,సర్పంచులు మద్ది సురేఖ కరుణాకర్ రెడ్డి ,సాలీ వీరనాయక్ ,శివిరాజు నాయక్,నారాయణ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్ ,పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story