బీజేపీ ప్రభుత్వం తోనే పేదలకు సంక్షేమం : తోకల శ్రీనివాస్ రెడ్డి

by Kalyani |
బీజేపీ ప్రభుత్వం తోనే పేదలకు సంక్షేమం : తోకల శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, శంషాబాద్ : బీజేపీ ప్రభుత్వం తోనే పేదలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతాయని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్, కాచారం, చౌదరి గూడ, నర్కుడ గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని కోరిన బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి గ్రామాలలో మహిళలు బ్రహ్మరథం మంగళహారతులతో ఘన స్వాగతం. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకటిగా కలిసి ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ జిరాక్స్ కాపీ గా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల కొరకు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబమే లాభ పడిందన్నారు.

ఏ సంక్షేమ పథకం పెట్టిన ఆ పథకాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ఇచ్చారు. కానీ పేద ప్రజలకు ఇవ్వలేదన్నారు. బీజేపీ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల కొరకే ప్రవేశపెట్టారని ఈ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు మార్చి వాడుకుంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఉన్న విలువైన భూములను అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్ముకొని తన నియోజకవర్గం గజ్వేల్ లో అభివృద్ధి చేసుకున్నారు. కానీ రాజేంద్రనగర్ నియోజకవర్గం లో కనీసం పేద ప్రజల కొరకు వంద పడకల ఆసుపత్రి కూడా నిర్మించలేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనే ధ్యాస ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్, సర్పంచులు సునిగంటి సిద్దులు, ఎంపిటిసి బుక్క ప్రవీణ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు చిటికెల వెంకటయ్య, చంద్రయ్య, వేణు రెడ్డి, ప్రసాద్, పెంటయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, కుమార్ యాదవ్, మాధవ రెడ్డి, బాల్ రాజ్ గౌడ్, ప్రకాష్, శ్రీధర్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్ గౌడ్, మల్చలం మహేష్, లింగమయ్య, నగేష్ గౌడ్, మోహన్ రావు, సంజీవ, వినోద్, భాస్కర్, కిట్టు ముదిరాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed