- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, మహేశ్వరం: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు మండలంలోని నేదునూరు మోడల్ స్కూల్ లో, మహేశ్వరం మండల కేంద్రంలోని గడికోటలో సీఎం కప్ 2023 మండల స్థాయి క్రీడా పోటీలను జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత గెలుపు ఓటములను సమానంగా చూడాలన్నారు. క్రీడాకారుల కోసం ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో 52 కంపెనీలు వచ్చాయన్నారు.
నిరుద్యోగ యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మద్ది కరుణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, బీఆర్ఎస్ నియోజకవర్గం కార్యదర్శి అంజయ్య ముదిరాజ్, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, తహసీల్దార్ మహమ్మద్ ఆలీ, ఎంపీడీవో నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.