- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దోచుకున్న ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు కక్కిస్తాము
దిశ,మహేశ్వరం : గత ప్రభుత్వ హయాంలో దోపిడీయే ఎజెండాగా మంత్రులు పనిచేశారని, వారు దోచుకున్న తెలంగాణ సొత్తుని కక్కించి పేదలకు పంచుతామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ ఈ సిటీలో ఈనెల 6వ తేదీన జరుగనున్న ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేయనున్న తెలంగాణ జన జాతర బహిరంగ సభ పనులను పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు వాత పెడతారన్నారు. కరువుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరాచకాలు,
అక్రమాలు, విపరీతంగా చేశారన్నారు. ధరణి పేరుతో పేదల భూములను కొల్లగొట్టారన్నారు. ఇరిగేషన్, విద్యుత్ భారీ ఎత్తున అవినీతి చేశారన్నారు. కాలేశ్వరం,మిషన్ భగీరథ, విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిని వెలిక్కి తీయడానికి కమిషన్ వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫోన్ టాపింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ నాయకుల ఫోన్లనే కాకుండా సామాన్య ప్రజల ఫోన్లను టాపింగ్ చేయకుండా వదలలేదన్నారు. కాంగ్రెస్ పార్టీది పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమన్నారు. తెలంగాణ జన జాతర బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు కేఎల్ఆర్, దేప భాస్కర్ రెడ్డి, చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.