- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా స్థలంలో నేను ఏమైనా చేసుకుంటా..
దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన రాంపూర్ గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 443 లోని తన పట్టా భూమిలో తాను పల్లిమిల్లును ఏర్పాటు చేసుకోవద్దా అని రైతు హరి మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2008 సంవత్సరంలో పాఠశాలను నిర్మించి గ్రామస్తుల కోరిక మేరకు తన సొంత పొలంలోని 11 గుంటల భూమిని విరాళంగా ఇచ్చానని ఆయన తెలిపారు.
పాఠశాలకు ఇవ్వగా మిగిలిన తన సొంత పొలంలో పల్లిమిల్లు నిర్మాణానికి పనులు చేస్తుండగా గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు అడ్డుకోవడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన మిల్లు నిర్మాణం చేపడితే, విద్యార్థులకు శబ్ద, వాయు కాలుష్యం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని, గతంలోనే పాఠశాల పక్కనే వ్యవసాయ గోదాము కోసం షెడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల విద్యార్థులకు ఇప్పటికే తీరని నష్టం కలుగుతుందని గ్రామస్తులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
పాఠశాల పక్కన మిల్లు నిర్మాణ పనులు చేపట్టకూడదని గత పది రోజుల క్రితం గ్రామ సభలో చర్చించినట్లు కూడా గ్రామస్తులు పేర్కొన్నారు. అదేవిధంగా బుధవారం ఉదయం స్థానిక పంచాయతీ కార్యదర్శి రమేష్ నాయక్ రైతు హరి మోహన్ రెడ్డికి నిర్మాణ పనులు చేపట్టకూడదని నోటీసులు కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతు హరిమోహన్ రెడ్డి మాత్రం ఎవరు చెప్పినా వినకుండా పాఠశాల పక్కనే బుధవారం ఉదయం జేసీబీ సాయంతో గుంతలు సైతం తీయడంతో పాఠశాల విద్యార్థులు, యువజన నాయకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిఘటించారు.