- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు ఆత్మహత్య..
దిశ, శంకర్పల్లి : వివాహిత మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపులారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రజిత, యాదయ్యలు ఇద్దరు భార్యాభర్తలు వీరు గోపులారం గ్రామంలో నివాసం ఉంటున్నారు. రజిత భర్త యాదయ్యతో కలిసి దొంతన్ పల్లి లోని ఇక్ఫాయి కళాశాలలో పనికి వెళ్ళేది. అయితే భర్త యాదయ్యకు రజిత (25)కు మధ్య కొంతకాలంగా సంసారం విషయంలో మనస్పర్ధలు ఏర్పడ్డాయన్నారు. దీంతో రజిత శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కొడుకు అఖిల్, కూతురు ప్రసన్నలు ఉన్నారు.
కొండకల్ గ్రామంలో..
కొండకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొండకల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ (27) ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగించేవాడు. కాగా నిత్యం మద్యం తాగి అప్పులు ఎక్కువ చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం అప్పులు తీర్చడానికని అత్తమామలతో డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. తెల్లారి చేసేసరికి శవమై కనిపించడంతో భార్య మీనాక్షి లబోదిబోమంది. వీరికి పిల్లలు లేరు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.