- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సేవాలాల్ చూపించిన సన్మార్గంలో నడవాలి : తుకారం నాయక్
దిశ, బొంరాస్ పేట్ : సేవాలాల్ మహారాజ్ చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడిచి ఆయన ఆశయాలను సాధించాలని గిరిజన నాయకుడు తుకారాం నాయక్ పేర్కొన్నారు. బుధవారం, బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతుసేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను మండలంలో కేతావత్ తుకారంనాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదన్ పల్లి తండా నుంచి బొంరాస్ పేట్ మండల కేంద్రంలోని భూలక్ష్మి చౌరస్తా వరకు టపాసులు పేలుస్తూ, డీజేతో సంప్రదాయ నృత్యాలతో, భారీ ర్యాలీ నిర్వహించి, క్రేన్ సహాయంతో సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని (ఫ్లెక్సీ) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో తుకారం నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని ఇంత గొప్పగా జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు. సేవాలాల్ సమాజ శ్రేయస్సుకోసం చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. గిరిజన బిడ్డలు ఐక్యంగా ఉంటూ, అభివృద్ధిలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ, సీతారాం నాయక్, మోత్యానాయక్, నరసింహనాయుడు, సంతోష్ నాయక్, హాజీమాలాంగ్ బాబా, కిష్టప్ప, సర్పంచ్ శంకర్ నాయక్, గిరిజన సోదరులు పాల్గొన్నారు.