WhatsApp : వాట్సప్ నిషేధంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

by M.Rajitha |
WhatsApp : వాట్సప్ నిషేధంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్(Whats App) నిషేధంపై సుప్రీంకోర్ట్(Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. వాట్సప్.. ఐటీ నిబంధనలు-2021 పాటించడం లేదని, దానిని నిషేధించాలని కేరళ(Kerala)కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాట్సప్ వ్యక్తిగత గోప్యతకు వివిధ దేశాల్లో ప్రత్యేక నిబంధనలు పాటిస్తున్న వాట్సప్.. భారత్ లో మాత్రం ఎలాంటి నిబంధనలు పాటించడం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే అది తొందరపాటు చర్యని, పిటిషన్ ను పక్కకు పెట్టింది కేరళ హైకోర్ట్. ఇదే విషయంపై పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ.. వాట్సప్ ప్రాథమిక హక్కుల నిబంధనలు ఉల్లంఘిస్తోందని, జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా మారిందని, వెంటనే వాట్సప్ ను నిషేధించాలని పిల్ లో పేర్కొన్నాడు. కాగా పిల్ ను పరిశీలించిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ ల సుప్రీం ధర్మాసనం.. ఆ పిల్ ను కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed