నెక్స్ట్ పీఎం, మన సీఎం

by Sumithra |
నెక్స్ట్ పీఎం, మన సీఎం
X

దిశ, తాండూరు : నెక్స్ట్ పీఎం, మన సీఎం అని తాండూరు టీఆర్ఎస్ నాయకులు అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మర్చి జాతీయ స్థాయిలో పార్టీని అమలు చేసిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపి తాండూరు పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలను భారత దేశ వ్యాప్తంగా ప్రజలందరికి చేరాలని కేసీఆర్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ఒకే వర్గానికి చెందిన ప్రభుత్వం నేడు దేశాన్ని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఒక గొప్ప సంకల్పంతోనే జాతీయ పార్టీని పెట్టారని అన్నారు. దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తారని తెలిపారు.

Advertisement

Next Story