ఆదివారం సైతం కొనసాగిన పంచాయతీ కార్యదర్శుల సమ్మె..

by Kalyani |
ఆదివారం సైతం కొనసాగిన పంచాయతీ కార్యదర్శుల సమ్మె..
X

దిశ, తాండూరు రూరల్: ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే న్యాయమైన డిమాండ్లను కోరుతున్నామని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు లాలప్ప పలువురు పంచాయతీ కార్యదర్శులు సైతం గుర్తు చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న మాకు ప్రభుత్వం ఎందుకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చూడడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించేంతవరకు ఈ సమ్మె శాంతియుతంగా కొనసాగిస్తామని హెచ్చరించారు.

గ్రామాలలో ప్రజలకు పాలకులకు అధికారులకు వారధిగా పని చేస్తూ విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని తాండూర్ యాలాల బషీరాబాద్ పెద్దేముల్, దౌల్తాబాద్ కొడంగల్ మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో తాండూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట భారీ నిరసన ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాములు, ఫక్రోజి, రవి, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed