- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా తీర్పును శిరసావహిస్తా.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
by Sumithra |
X
దిశ, ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్ గెలుపు కోసం నిరంతరం పని చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ రుణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసి ఎన్నికల హామీలను నెరవేర్చి ప్రజల మన్ననలు పొందాలని కోరారు.
Advertisement
Next Story