- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం.. నీలం మధు ముదిరాజ్
దిశ, శంకర్ పల్లి : సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంక్షేమ భవనాన్ని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు అండగా నిలుస్తున్నారని, బీసీ గణనతో ముదిరాజులకు రాజకీయ అవకాశాలు పెరగనున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు పెద్దపీట వేసి ముదిరాజ్ జాతి సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్ లను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు టికెట్లు ఇచ్చి గుర్తింపుని ఇచ్చిందని కొనియాడారు. అసెంబ్లీలో ముదిరాజులకు అవకాశం కల్పించడమే కాకుండా స్థానిక సంస్థలలో ముదిరాజుల ప్రాతినిధ్యం పెరిగేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న బీసీ కుల గణన దోహదం చేస్తుందని పేర్కొన్నారు. బీసీ కులగనన పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ముదిరాజుల రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయని అన్నారు. గత ఎన్నికలకు ముందు ముదిరాజులకు రాజకీయ గుర్తింపు కోసం ఐక్యంగా పోరాడిన మన జాతి బిడ్డలంతా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఐకమత్యంతో ముందుకు కదిలితే మన హక్కులను సాధించుకోవచ్చని స్పష్టం చేశారు.
మన గుర్తింపు సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మనమంతా అండగా నిలబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పుల్మామిడి రాజు, శంకరపల్లి మండల అధ్యక్షుడు తలారి మైసయ్య, అందే బాబయ్య, డాక్టర్ మద్దెల సంతోష్, శంకర్పల్లి మాజీ జెడ్పిటిసి కిచ్చన్నపల్లి నారాయణ, శ్రీకాంత్, నరేష్, జంగయ్య, రాములు, మన్నె వెంకటేష్, లింగం ముదిరాజ్, శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంసాని ప్రకాష్ గుప్తా, పీసీసీ కార్యవర్గ కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.