- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షాలతో అన్నదాత కంట కన్నీరు..
దిశ, వెల్దండ: అకాల వర్షాలు కురవడంతో ధాన్యం కుప్పల, బస్తాలపై కవర్లు కప్పుతూ అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం నాటిన నాటి నుంచి అనేక రకాల శ్రమకోర్చి సాగు చేస్తే పంట చేతికందే సమయానికి అకాల వర్షాలు రైతులను కోలుకోలేకుండా దెబ్బతీస్తున్నాయి. మండు వేసవిలోనూ అకాల వర్షాలు, వడగళ్లు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో హఠాత్తుగా వర్షం కురువడంతో మండల పరిధిలోని పెద్దాపూర్ సమీపంలో స్పెక్ట్రా వెంచర్ లోపల రహదారిపై పలువురు రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం రాశుల్లోకి వర్షం నీరు వెళ్లి పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో ఆరబోసిన పంట రాశులను కాపాడుకోవడం రైతుల కష్టాలు వర్ణాతీతం. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.