బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్

by Kalyani |
బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి :  కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : విద్యార్థి దశనుండే బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సంఘం లక్ష్మి బాయి గురుకుల పాఠశాల నందు ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు బ్యాండ్ మార్చ్ ఫాస్ట్ ద్వార కలెక్టర్ కు స్వాగతం పలికారు. పరిగి బాలసదన్ విద్యార్థినిలచే ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు చాచా నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవం జరుపుకోవడం సంతోషకరం అన్నారు. చదువు అనేది మంచి అవకాశం, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. మీలాగే విద్యార్థి దశ నుండి కష్టపడి చదివి నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి విద్యలో ముందంజలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి, శిశు సంక్షేమ అధికారి కృష్ణ వేణి, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, కాంతారావు, శ్రీకాంత్, ఉపాద్యాయులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story