- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదేశాలు అమలు చేయరా.. ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోని సిబ్బంది
దిశ, రంగారెడ్డి బ్యూరో/ షాద్‌నగర్: ఉన్నతాధికారుల ఆదేశాలు కింది స్థాయి సిబ్బంది పట్టిచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలపై రైతులు, ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినా సమస్యలు మాత్రం పెండింగ్ లోనే ఉంటున్నాయి. కింది స్థాయి అధికారులు సదరు ఆక్రమణ, కబ్జాదారులతో కుమ్మకై సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ శాఖ స్పందించాలి. ప్రధానం గా సహజ సిద్ధమైన వనరులను దెబ్బతీసే హక్కు సొంత యాజమాన్యాలకు లేదని రెవెన్యూ చట్టం చెబుతోంది. అందుకు విరుద్ధంగా జిల్లాలోని రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖలు నిబంధనలకు నీళ్లోదులుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజాసేవకు పని చేస్తున్నాం అని చెప్పుకునే అధికారులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించక పోవడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అందినకాడికి దోచుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, బూధాన్, సీలింగ్ భూములతో పాటు కుంటలు, చెరువులు, నాలాలు, కాలువలు లాంటి వాటిని పూర్తిగా ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లాలో వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి. వాటిమీద సమీక్షలు లేవు, చర్యలు కూడా లేవు.
కాల్వను ధ్వంసం చేసిన క్షేత్ర ఫామ్ లాండ్..
రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ నియోజక వర్గం, కొందుర్గు మండలం, రేగడి చిల్కమర్రి గ్రామంలో 240, 247 సర్వే నంబర్లతో పాటు కాలువకు ఉన్న కల్వర్టును క్షేత్రా ఫామ్ లాండ్ ఆక్రమించింది. దీనిపై రైతులు జనవరిలో ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మార్చి 17 నోటీసులు జారీ చేసి కబ్జా నుంచి తొలగించాలని 27 తేదీ వరకు గడువు ఇచ్చారు. అయినా ఫామ్ లాండ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 0.05 గంటల స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నట్టు స్పష్టమవుతుంది. సర్వే నంబర్లలో కాలువలు ఆక్రమణకు గురయ్యాయని వాగు కబ్జా చేసినందుకు చర్యలు తీసుకోవాలని కొందుర్గు ఎమ్మార్వో కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. దీని వెనుక మతలబు ఏంటని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల వైఖరి ఏంటి..
అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులుపై చర్యలు తీసుకోవాలని అధికారి ఆదేశిస్తే ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియడం లేదు. సర్క్యులర్ జారీ చేసినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలపాలని ప్రజలు కోరుతున్నారు.