నేడు శ్రావణమాసం తొలి సోమవారం.. శివనామ స్మరణలతో మార్మోగిన చెందిప్ప మరకత శివాలయం

by Mahesh |
నేడు శ్రావణమాసం తొలి సోమవారం.. శివనామ స్మరణలతో మార్మోగిన చెందిప్ప మరకత శివాలయం
X

దిశ, శంకర్పల్లి: నేడు శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో దేవాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగాయి. శంకర్పల్లి మండలంలోని చెందిప్ప మరకత శివాలయంలో సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రావణమాసం ఈ సోమవారం నుంచి ప్రారంభం కావడం భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారికి అభిషేకం చేయడానికి పోటీపడ్డారు. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలభైరవ స్వామికి పూజలు నిర్వహించి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి అభిషేకాలు కొనసాగగా భక్తులకు మరో క్యూలైన్ ద్వారా దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో ఒకవైపు మారుమ్రోగగా.. మరోవైపు భజన మండలి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి వారిని కీర్తిస్తూ.. నిరంతరం భజన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు దేవాలయానికి తరలిరావడంతో ఆలయం పరిసర ప్రాంతాల వరకు కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ఇతర వాహనాలు అన్నింటినీ గ్రామపంచాయతీ సమీపంలోనే నిలిపివేశారు.

Advertisement

Next Story

Most Viewed