- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్పొరేట్ కాటు!
దిశ, రంగారెడ్డి బ్యూరో, గండిపేట్: ప్రభుత్వ పర్యవేక్షణ లేమీ.. అధికారులు అలసత్వం వెరసి.. జిల్లాలో ‘కార్పొరేట్’కు విద్యావ్యవస్థ దాసోహమైంది. విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలకు సామాజిక, మానసిక అంశాలపై శిక్షణ ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం నాలుగు గోడల మధ్యే విద్యార్థులను బంధించి విద్యను బోధిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఇంటర్మీడియట్ విద్యాధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ పరీక్షల పరిశీలనకే పరిమితమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి కార్పొరేట్ విద్యనందించాలని లక్ష్యమే తప్ప మరో ధ్యాస లేకుండా కాలేజీలలో చేర్పిస్తున్నారు. ఆ విద్యార్థి మానసిక పరిస్థితి, ఆసక్తి ఉన్న రంగాలపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆ కళాశాల యజమాన్యం, ప్రిన్సిపాల్, లెక్చరర్ల మానసిక ఒత్తిడిని విద్యార్థులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చదువుపేరుతో మానసిక ఒత్తిడి..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని అనేక కార్పొరేట్ విద్యాసంస్థలు చదువు పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రీ లాంటి కార్పొరేట్ కళాశాలలు ఊరికి దూరంగా రవాణా సౌకర్యంలేని ప్రాంతాలలో బ్రాంచీల పేరుతో కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాయి. ఈ కార్పొరేట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం దాసోహంగా మారింది. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాధికారులు వసూళ్లకు అలవాటు పడి తనిఖీలు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఆ కాలేజీలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది.
మానసిక ఉల్లాసానికి చర్యలేవి.?
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవాడికి మానసిక అంశాలపై శిక్షణ ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇంటర్మీడియట్ విద్యాధికారులు పరీక్షల పరిశీలనకే పరిమితమయ్యారు. బ్రాంచీల పేరుతో నడిపించే కాలేజీలపై ఎందుకు వేటు వేయడంలేదనే ప్రశ్నలు ఉత్పత్తన్నమవుతున్నాయి. చదువులో భాగమైన క్రీడా విభాగంపై దృష్టి ఎందుకు పెట్టడం లేదు.. వీటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో విద్యా సంస్థల పనితీరు ప్రతిక్షణం పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జరుగుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలలో ఆటల విభాగం పూర్తిగా నిషేధించారు. కేవలం నాలుగు గోడల మధ్య విద్యార్థిని బందీ చేసి విద్యనభ్యసించే దుస్థితికి చేర్చింది. ఇందులో భాగంగానే నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఆ యజమాన్యం పెట్టిన హింసను తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కన్నీరుపెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్...
శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. ‘అమ్మ నాన్మ, అన్న’ మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ పనిచేయలేదు. నాకు కాలేజీలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్ నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. అందుకే ఈ పనిచేస్తున్నా.. క్షమించండి. మిస్ యూ అమ్మ, మిస్ యూ ఫ్రెండ్స్ అని లెటర్‌లో రాశాడు. హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్ సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్యకు ముందే సాత్విక్ రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్‌లో స్వాతిక్ తన ఆవేదనను వెళ్లగక్కిన తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
- Tags
- Education