కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ ను సందర్శించిన ఎస్పీ ఎన్ కోటిరెడ్డి..

by Kalyani |
కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ ను సందర్శించిన ఎస్పీ ఎన్ కోటిరెడ్డి..
X

దిశ, కొడంగల్: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రావులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బందితో వారు మాట్లాడుతూ ముందుగా వాహనాల నమోదు రిజిస్టర్ పరిశీలించారు. వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టిసారించాలని సిబ్బందికి సూచించారు. అక్రమంగా డబ్బు, మద్యం, మారణాయుధాలు వెళ్లకుండా నిరంతరం వాహనాల తనిఖీలు చేయాలని, ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed