- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో సీనియర్ల లొల్లి.. రేవంత్ పర్యటనకు దూరం
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లుకు మధ్య ఇంకా సఖ్యత కుదరడం లేదు. రేవంత్ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. సీనియర్లు మాత్రం అతనితో కలవలేకపోతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి సీనియర్లు అతనిపై గుర్రుగా ఉంటూ వస్తున్నారు. ప్రధానంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి) బాహాటంగానే రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వస్తుండగా... మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, గీతారెడ్డి వంటి వాళ్లు బయటకు కనిపించకపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం లేదు. తమ నియోజకవర్గాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్లతో పాటు పలువురు సీనియర్లు రేవంత్ వ్యతిరేక టీం అనే ముద్ర వేసుకున్నట్లు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతున్నది. పార్టీ శ్రేణులు అనుకుంటున్నట్లుగానే ఆదివారం రేవంత్‌రెడ్డి మెదక్ పట్టణానికి వస్తే సీనియర్లు అటుగా రాకపోవడం గమనార్హం.
పార్టీ కార్యక్రమం కాకపోయినప్పటికీ ఉమ్మడి జిల్లా నేతలంతా హాజరవుతున్నట్లు మెదక్‌జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, ఇతర నేతలు ప్రచారం చేసుకున్నారు. చర్చీ చూడడానికి రేవంత్వస్తున్నాడని చెప్పి పట్టణంలో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, భారీ స్థాయిలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దామోదర రాజనరసింహ మినహా మిగతా సీనియర్లు మెదక్ రాకపోవడం గమనార్హం. మెదక్ పట్టణానికి రేవంత్ వస్తున్నారని, రావాల్సిందిగా పలువురు జగ్గారెడ్డికి ఫోన్‌చేశారు. అయితే తానేందుకు వస్తానని ఆయన చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. రేవంత్ మెదక్ వస్తే సీనియర్లు ఎవరు హాజరు అయ్యే అకాశాలు కనిపించడం లేదని శనివారమే ఉమ్మడి జిల్లాలో ప్రచారం జరిగింది.
దామోదర్ ఇంటికి వెళ్లిన రేవంత్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉదయం సంగారెడ్డి పట్టణంలోని దామోదర రాజనరసింహ ఇంటికి వెళ్లారు. అప్పటికప్పుడు రాజనరసింహను వెంటబెట్టుకుని మెదక్పట్టణానికి తరలివెళ్ళారు. అయితే శనివారం రోజే సీనియర్లు ఎవరు మెదక్ వచ్చే అవకాశాలు లేదని తెలుసుకుని రేవంత్ దామోదర్ ఇంటికి వెళ్ళినట్లు పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతున్నది. జిల్లాకు వచ్చినప్పటికీ సీనియర్లు ఎవరు లేకపోతే పరువుపోతుందని భావించి రేవంత్ నేరుగా దామోదర్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మెదక్ వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా చేగుంట నుంచి వెళతారు. రేవంత్ మాత్రం సంగారెడ్దికి వెళ్లి తిరిగి అందోలు మీదుగా మెదక్ వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇది పార్టీ ప్రోగ్రాం కాదని, ఆయన చర్చీ చూడడానికి వస్తున్నారని, ఈ కార్యక్రమానికి వెళ్లాలని నిబంధన లేదు కదా? అని సీనియర్లు సన్నిహితులతో అంటున్నారు.
మెదక్‌లో మాత్రం రేవంత్‌కు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏదీ ఏమైనా కాంగ్రెస్‌లో రేవంత్ వర్సెస్ సీనియర్ల పంచాయతీకి ఎప్పుడు పుల్‌స్టాప్ పడునున్నదనే అంశం కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నది.