- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కళ్యాణం.. కమణీయం..
దిశ, యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో బీఎన్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది. అనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని గ్రామసర్పంచ్ కంబాలపల్లి ఉదయ శ్రీ రవీందర్ రెడ్డి దంపతులు దగ్గరుండి శివపార్వతుల కళ్యాణాన్ని వేదమంత్రాలు భాజా భజంత్రీల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు.
ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృప కటాక్షాలను పొందారు. అనంతరం ఆలయం వద్దకు వచ్చినటువంటి భక్తులందరికి మధ్యాహ్నం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సిద్దేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బీఎన్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడెడ్ల గోవర్ధన్ రెడ్డి, బీఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్ర శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు మేకం శంకర్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.