Sabitha Indra Reddy : ఓటమిని ఎరుగని నేత సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |   ( Updated:2023-12-03 10:51:50.0  )
Sabitha Indra Reddy : ఓటమిని ఎరుగని నేత సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రంలో పోటి చేసిన ప్రతి సందర్భంలో ఓటమి లేకుండా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గెలుస్తూ వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్ధిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములుపై 26,320 ఓట్లతో గెలుపొందారు. ఇదే మహేశ్వరం నియోజకవర్గం నుంచి మూడోవ సారి ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి ఎన్నికైయ్యారు. 2009, 2018, 2023లల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి గెలిచి చరిత్ర సృష్టించారు. 2000, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 5,46,577 ఓట్లు ఉండగా 3,02,762 ఓట్లు నమోదైయ్యాయి. ఇందులో బీఆర్​ఎస్​ అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డికి 1,25,416 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి అందెల శ్రీరాములుకి 99,096 ఓట్లు పోలైయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed