Rangareddy Collector : సర్వేలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

by Aamani |
Rangareddy Collector : సర్వేలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
X

దిశ,రంగారెడ్డి బ్యూరో: సర్వేలో ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. సర్వేలో భాగంగా సేకరించే సమాచారం సమగ్రంగా ఉండాలని ఎన్యూమినేటర్లకు కలెక్టర్ సూచించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి నుండి నిర్వహేంచే కుటుంబ సమగ్ర సర్వే లో ప్రజలు, తమ కుటుంబంలోని స్థితిగతులకు సంబంధించి అన్ని వివరాలను సక్రమంగా ఇవ్వాలని, ఇంటికి వచ్చే ఎన్యూమినేటర్లకు సరైన సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, సమగ్ర సర్వేకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అందరూ సహకరించాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు సంబంధించిన సమాచార సేకరణలో గ్రామస్థాయిలో వార్డు నుండి మొదలు కోని కేటాయించిన బ్లాక్ స్థాయి వరకు ప్రతి కుటుంబంలోని వివరాలను సక్రమంగా సేకరించాలని ఆయన అన్నారు. సమాచారం నమోదు చేసుకోని ఎన్యూమినేటర్లు అత్యంత జాగ్రత్తగా వివరాలు సేకరించి, వారికి ఇచ్చిన ఫార్మట్ లో నమోదు చేయాలని, సర్వే నిర్వహణలో ఏదైన సందేహాలు తలెత్తినట్లు అయితే వెంటనే పరిష్కరించుకొనే దశలో ముందుకెళ్ళాలని అన్నారు.

బుధవారం నుండి మూడు రోజుల పాటు ఆయా బ్లాకులలో ఉన్న ఇండ్ల వివరాల జాబితాను ఇన్యూమినేటర్లు సేకరిస్తారని తదుపరి 15 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చిన ఫార్మట్ ప్రకారంగా కుటుంబంలోని వారి వివరాలను సేకరించడం జరుగుతుందని, అనంతరం సర్వే నిర్వహించిన పిదప ఇంటికి స్టిక్టర్ ను అతికించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో మున్సిపల్ మినహా 5344 మంది ఎన్యూమినేటర్లను ఈ సర్వేకోసం నియమించడం జరిగిందన్నారు. ప్రతి 10 మంది ఎన్యూమినేటర్లకు ఒక సూపర్వైజర్ ను నియమించామన్నారు. జిల్లా స్థాయి స్పెషల్ అధికారిని నియమించడం తో పాటు. జిల్లా స్థాయిలో సర్వే మానిటరింగ్ కోర్ కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 6 లక్షల 57 వేల కుటుంబాలను ఎన్యూమినేటర్లందరూ సర్వే చేయబోతున్నారన్నారు. ఈ సర్వేలో కుటుంబానికి సంబంధించిన విషయాలే ఉన్నందున, ప్రభుత్వం చేసే సర్వేలో ప్రజలు ఎలాంటి అపోహాలకు పోవాల్సిన అవసరం లేదన్నారు. దీని ద్వారా కుటుంబ స్థితి గతులు, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల వివరాలను ఈ సర్వేలో సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed