- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదు..
దిశ, శంకర్పల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు అంజన్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శంకర్పల్లిలో బుధవారం ప్రజాగోష- బీజేపీ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, ఆయన కుటుంబమే బాగుపడిందని అన్నారు. రాష్ట్రంలో సమస్యలు తాండవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రానుందని జోష్యం చెప్పారు. నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇల్లు లేని వారికి వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జి కంజర్ల ప్రకాష్, సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శంకర్పల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు బీర్ల సురేష్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.