రూ.38 కోట్ల 60 లక్షలతో పట్టణానికి మంచి నీటి సరఫరా

by Sridhar Babu |
రూ.38 కోట్ల 60 లక్షలతో పట్టణానికి మంచి నీటి సరఫరా
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : అమృత్ 2.0 పథకంలో భాగంగా జగిత్యాల పట్టణానికి రూ.38 కోట్ల 60 లక్షల వ్యయంతో మంచి నీటి సరఫరా చేసేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్​పర్సన్​ జ్యోతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. అమృత్ 2.0 మంచి నీటి సరఫరా పథకం అమలుకు పట్టణాన్ని 14 జోన్లుగా మార్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం జగిత్యాల పట్టణ,నియోజకవర్గ అభివృద్ధి పనులకు సెంట్రల్ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎంపీకి వినతి పత్రం అందజేశారు. జగిత్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించడంతో పాటుగా నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట హైలెవల్ బ్రిడ్జిలు, అండర్ పాస్ వేలు,సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి నిదులు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి, ఈఈ సంపత్ రావు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed