రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

by Sumithra |
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
X

దిశ, ఆమనగల్లు : తెలంగాణ ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రూపంలో వివిధ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండల ఆర్కపల్లి గ్రామంలో జరిగిన ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారితో కలిసి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తిచేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించి నేటికి 9 సంవత్సరాలు అవుతుందన్నారు.

ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్టునను అసమర్థ సీఎం పూర్తి చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని విమర్శించారు. అనంతరం తల్లోజు ఆచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, సుకన్య సమృద్ధి యోజన పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. సిలిండర్ పై రూ.280, ప్రతి లీటర్ పెట్రోల్ పై రూ.38 వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పెద్దయ్య చారి, రాములు, యాదయ్య, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed