- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
న్యూ ఈయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
దిశ, బడంగ్ పేట్ : న్యూ ఇయర్ జోష్ మొదలవడంతో రాచకొండ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మహేశ్వరం డివిజన్ డీసీపీ సునీతా రెడ్డి పర్యవేక్షణలో సోమవారం సాయంత్రం బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ బృందం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాంహౌస్‌లు, హోటళ్లు, మండి రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషిద్ధ డ్రగ్స్ ను న్యూ ఇయర్ వేడుకల పేరుతో అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని కాపాడేందుకు పోలీసులతో చేతులు కలపాలని, డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే మొబైల్ నెంబర్ 8712662366 కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ తనిఖీల్లో బాలాపూర్ ఏసీపీ మహేశ్వరం లక్ష్మీకాంతరెడ్డి, ఎస్‌హెచ్‌వో బాలాపూర్ సుధాకర్, ఎస్‌ఐలు షేక్ యూసుఫ్ జానీ, శ్రీనివాస్, ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.