- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడంగ్ పేట కార్పొరేషన్ లో ప్లెక్సీల వివాదం..
దిశ, బడంగ్పేట్: ఈ నెల 4వ తేదీన మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు జన్మదినం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ కార్పొరేషన్లో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సమాచారం అందుకున్న బడంగ్పేట్ కార్పొరేషన్ కమిషనర్, తన బృందంతో కలిసి ఫ్లెక్సీలను తొలగించడం పట్ల బీజేపీ నాయకులు మండిపడ్డారు. బడంగ్పేట్ కమిషనర్ వ్యవహార తీరు పట్ల బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి, కమిషనర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రతిపక్ష నాయకుడి ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా స్వయంగా మంత్రి ఆదేశాలను పాటిస్తున్నామని అధికారులు చెప్పటం సిగ్గుచేటని బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు దిగిన వారిలో బడంగ్ పేట కార్పొరేషన్ ప్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు గౌర రమాదేవి శ్రీనివాస్, ఇంద్రసేనా, మంత్రి మహేష్ ముదిరాజ్, బంగారు రాహుల్, నిమ్మల రవికాంత్ గౌడ్, ఇల్లందుల సాయి, లాల సందీప్, రాకేశ్, భరత్, రవికాంత్ రెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.