అనుమతులు సువిధ లో దరఖాస్తు చేసుకోవాలి : రిటర్నింగ్​ ఆఫీసర్​ ఎ.విజయకుమారి

by Kalyani |   ( Updated:2023-10-18 15:01:47.0  )
అనుమతులు సువిధ లో దరఖాస్తు చేసుకోవాలి : రిటర్నింగ్​ ఆఫీసర్​ ఎ.విజయకుమారి
X

దిశ,పరిగి : సాధారణ ఎన్నికలకు సంబంధించిన వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు ప్రచారం, ఇతర ఎన్నికలకు సంబంధించిన అనుమతులకు దరఖాస్తులు సువిధ ఆప్​ లో చేసుకోవాలని రిటర్నింగ్​ ఆఫీసర్​ ఎ.విజయ కుమారి సూచించారు. రిటర్నింగ్​ ఆఫీసర్​ అధ్యక్షతన పరిగి తహసీల్దార్​ కార్యాలయంలో బుధవారం గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు వారి పార్టీ ప్రచార అనుమతులను సువిధ అనే ఇంటర్నెట్ అప్ ద్వారా నే దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలియజేశారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఎం పార్టీల నాయకులుతోపాటు డీఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి, ఎన్నికల అధికారులు కోటి ఆనంద్​ రావు, శేషగిరి శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story