- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Parking : వైన్‌షాప్‌ల అడ్డగోలు పార్కింగ్.. వాహనదారుల ఇక్కట్లు
దిశ,అబ్దుల్లాపూర్మెట్: వైన్ షాప్ ల వద్ద అడ్డగోలు పార్కింగ్ లతో వాహనదారులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం చౌరస్తాలో గల ఓ వైన్ షాప్ వద్ద సరైన విధంగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో దుకాణానికి వచ్చే వ్యక్తులు అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారు. దీని సరి చేయాల్సిన వైన్ షాప్ దుకాణదారులు సైతం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడంతో రోడ్లపైకి తమ తమ వాహనాలు పెడుతున్నారు. దీంతో రోడ్ల వెంట వెళ్లే ప్రజలు వాహనదారులు మరిన్ని ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది.
నాగోల్ నుంచి తట్టి అన్నారం వచ్చే రేడియల్ రోడ్డు వెంట ఉన్నా ఈ వైన్ షాపు వద్ద పెద్ద ఎత్తున వాహనాలను వెళుతున్నాడంతో ఈ పరిస్థితి దాపురిస్తుందని, అదేవిధంగా మద్యం సేవించి వెళ్లే క్రమంలో వాహనదారులకు అడ్డంగా మద్యం సేవించిన వారు వాహనాలను అడ్డుగా పెడుతూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని స్థానిక వాహనదారులు ప్రజల ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు ఇదే ప్రాంతంలో చౌరస్తాలాగా ఉండడంతో పాటు మూల మార్పులు ఉండటం కారణంగా పెద్ద పెద్ద వాహనాలు సైతం ఈ వైన్ షాప్ వాహనాల పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ సైతం నిలిచిపోతుందని వాపోతున్నారు. సదరు వైన్స్ యాజమాన్యం పార్కింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయపడుతున్నారు.