- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓయో హోటల్ యజమాని నిర్వాకం..రహస్య సీసీ కెమెరాల ఏర్పాటు
దిశ,శంషాబాద్ : హోటల్ కి వచ్చిన యువతి యువకుల వీడియోలు సీసీ కెమెరాల ద్వారా రూం లో రికార్డ్ చేసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు ప్రాంతానికి చెందిన గణేష్ గత మూడు సంవత్సరాలుగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో సీట గ్రాండ్ హోటల్ పేరుతో నిర్వహిస్తున్నాడు. అయితే సీటా గ్రాండ్ వస్తున్న యువతీ యువకుల రొమాన్స్ వీడియోలను రికార్డు చేయడానికి రూమ్ లలో స్విచ్ బోర్డ్ లలో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశాడు.
అయితే కొంతకాలంగా యువతీ యువకుల రొమాన్స్ వీడియోలు రికార్డ్ చేసుకుని ఫోన్లో వారికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఒక జంట ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం రాత్రి సీటా గ్రాండ్ హోటల్ పై దాడులు నిర్వహించి హోటల్లోని రూమ్ లలో ఉన్న సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకొని హోటల్ యజమానిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి హోటల్ ను సీజ్ చేశారు. అయితే ఆ హోటల్ యజమాని గణేష్ వద్ద రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లో యువతి, యువకుల రొమాన్స్ వీడియోలు పదుల సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల నిఘా లేకపోవడం వల్లే హోటల్లో అసాంఘిక కార్యక్రమాలు: స్థానికులు
శంషాబాద్ మున్సిపాలిటీ లో మున్సిపల్ అధికారులు, పోలీసుల నిఘా లేకపోవడం వల్లే వందల సంఖ్యలో హోటల్లో పేరుతో లాడ్జిలు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారని, అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి అన్నారు. ఇండ్ల మధ్యలో హోటల్ నిర్వహించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలోని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. హోటల్ ల పేరుతో వ్యభిచార గృహాలుగా హోటల్లు మారాయన్నారు. గంటకు రేటు పెట్టి యువతీ యువకుల వద్ద రోజు లక్షల్లో వసూలు చేస్తున్న హోటల్ యజమానులు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పోలీసులు హోటళ్లపై దాడులు చేసి హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.