తెలంగాణలో మరిన్ని ఎయిర్ పోర్టులు వస్తాయ్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..!

by Nagam Mallesh |
తెలంగాణలో మరిన్ని ఎయిర్ పోర్టులు వస్తాయ్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..!
X

దిశ, శంషాబాద్ : తెలంగాణలో మరిన్ని ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ లో భాగంగా శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామ్మోహన్ నాయుడు 10K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌర విమానాల శాఖలు సెక్యూరిటీ ఎంతో కీలకమని, గతంలో ఎటువంటి సమస్యలు వచ్చిన బ్లాగ్ సంస్థ ద్వారా ఎటువంటి లోపాలు లేకుండా బలమైన చట్టాలతో బలమైనటువంటి సెక్యూరిటీ సంస్థతో మైంటైన్ చేయడానికి కృషి చేస్తున్నామని, ప్రజలను కూడా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో ఈనెల ఐదు నుండి 11 వరకు నిర్వహించే రెండవ ఎడిషన్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారని వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి ఓ కార్యక్రమంలో పాల్గొనడం నాకు జీవితంలో గుర్తుండిపోయే విషయం అన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డెవలప్ చేయడమే కాకుండా అలాగే తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్ పోర్టులు వస్తాయి అని పలు సందర్భాల్లో చర్చలు కూడా జరిగాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎసిపి శ్రీనివాసరావు, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు రమ్య భారతి, అనిల్ కుమార్,శివకుమార్ మొహంక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed