- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల సంక్షేమాన్ని అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది.. MLC Kalvakuntla Kavitha
దిశ, బడంగ్పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదగనీయకుండా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించింది. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి భారత్‌లోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు. ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ గణేష్ మండపాన్ని టీఆర్ఎస్ యువనాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ కవిత సందర్శించి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ యువనాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డిలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్ళెం నిరంజన్‌రెడ్డి స్వామి వారి లడ్డూ ప్రసాదంగా అందజేశారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రతి ఏడు వినాయక చవతి వచ్చిందంటే బాలాపూర్ గణేష్ మండపం ఎలా ఉంటది? ఈ సారి లడ్డు వేలం పాట ఎంతకు పొతది అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. 'బాలాపూర్ వినాయకున్ని దర్శించుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. బాలాపూర్ గ్రామస్థులే ఒక కమిటీగా ఏర్పడి 42 సంవత్సరాలు గణేష్ విగ్రహం ఏర్పాటు చేస్తుండడం అభినందనీయం. ఈ సారి అరుణాచల ఆకృతిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అద్భుతంగా ఉంది.
ఈ మంచి ఒరవడిని ఇలాగే కొనసాగించాలి పేదోల సంక్షేమాన్ని అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఆ స్వామి దయవల్ల మన రాష్ట్రానికి ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకున్నా' అని కవిత అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బడంగ్పేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ వంగేటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Also Read : స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ఆరాటం : మాజీ మంత్రి బాబు మోహన్