- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలి.. హోంమంత్రి మహమూద్ అలీ
దిశ, శంకర్ పల్లి : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. శంకర్ పల్లిలోని బీవీఆర్ ఫంక్షన్ హాల్ ప్రక్కన నూతనంగా నిర్మించిన మసీద్ ను ఆయన బుధవారం ప్రారంభించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆయనకు బోకే అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు.
షాదీ ముబారక్ తో ఆర్థిక సాయం అందజేస్తున్నారని చెప్పారు. అలాగే రంజాన్ పండుగకు బట్టలు అందజేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, కౌన్సిలర్ చంద్రమౌళి, నాయకులు గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, వాసుదేవ్, పార్శి బాలకృష్ణ, జాకీర్, ముంతాజ్, ఎజాస్, రైమత్ ఖాన్, గౌస్, బాబా, సర్ తాజ్ తదితరులు ఉన్నారు.