- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెగా జాబ్ మేళా సక్సెస్

దిశ, తాండూరు : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మేఘ జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. తాండూరు వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతులు హాజరయ్యారు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ మహిళలకు వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దీంతో ఆదివారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ కంపెనీలైన యంఎన్ సి ఫాక్స్ కాన్ వారి సౌజన్యంతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహిళ మెగా జాబ్ మేళాలో 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆదివారం జరిగిన ఉద్యోగాల ఇంటర్వ్యూ కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేఘ జాబ్ మేళా కు సుమారు 400 మంది వరకు మహిళలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ జాబ్ మేళాలో నియోజకవర్గం నుంచి 400 మంది మహిళలు రావడం సంతోషకరమన్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూ కు హాజరైన వారిలో సగం మందికి అంటే 50 శాతం 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషకరమన్నారు. రోజుకు 8 గంటల పాటు పని వేళలు ఉంటాయన్నారు. ఎంపికైన మహిళలు ఇష్టంతో ఉద్యోగం చేయాలని సూచించారు. అదే ఉత్సాహంతో మహిళలు ముందుకెళితే వారి ఇళ్లు బాగుపడుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఉద్యోగ అవకాశం కల్పించిన ఫాక్స్ కాన్ కంపెనీ పై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తాండూరు నియోజకవర్గానికి విచ్చేసిన కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళాలకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించి, జాబ్ మేళా కు తీసుకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు నిరుద్యోగ మహిళలు పాల్గొన్నారు.