- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్కీ డ్రా పేరుతో భారీ ఘరానా మోసం
దిశ, మీర్ పేట్ : ఖరీదైన బహుమతులు ఇస్తామని ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేసి ప్రజల కు కుచ్చు టోపీ పెట్టిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లో మదన్ కుమార్ గౌడ్ గత కొంతకాలంగా డిఎంఎస్ ఎంటర్ప్రైజెస్ తో ఓ సంస్థ నడుపుతున్నాడు. ప్రజల నుంచి నెలకు రూ. 1100 చెల్లిస్తే స్కీమ్ కాల పరిమితి 15 నెలల ఉంటుందని ప్రతి నెల డ్రా తీసి విలువైన వస్తువులు గెలుచుకోవచ్చని డ్రా గెలిచిన వాళ్ళు తదుపరి నెల నుంచి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అమాయక ప్రజలకు ఆశ చూపి మోసం చేశారని తెలిపారు.
కాలనీకి చెందిన స్థానికులు దీపిక, భారతి, నందిని లు ప్రతి నెల డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు. మదన్ కుమార్ గౌడ్ ను డ్రా తీయడం లేదని అతన్ని ఫోన్ లో సంప్రదించగా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి మోసపోయామని గ్రహించి డిఎంఎస్ సంస్థ యజమాని పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, స్కీమ్ చెల్లించిన వారు 100 మంది పైగా బాధితుల ఉండొచ్చని వారి నుంచి సుమారు 40 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ఉండొచ్చని ఇన్స్పెక్టర్ తెలిపారు.